ఆంథ్రోపిక్‌ కొత్త టూల్‌.. భయం అక్కర్లేదన్న సుందర్‌ పిచాయ్‌
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)టెక్‌ కంపెనీలను కలవరపాటుకు గురిచేసిన అమెరికా ఏఐ స్టార్టప్‌ సంస్థ ‘ఆంథ్రోపిక్‌’ తాజాగా మరో కొత్త టూల్‌ను విడుదల చేసింది. సొంతంగా సీ-కంపైలర్లను రూపొందించే మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘ఆంథ్రోపిక్‌ (Anthro
ఆంథ్రోపిక్‌ కొత్త టూల్‌.. భయం అక్కర్లేదన్న సుందర్‌ పిచాయ్‌


హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)టెక్‌ కంపెనీలను కలవరపాటుకు గురిచేసిన అమెరికా ఏఐ స్టార్టప్‌ సంస్థ ‘ఆంథ్రోపిక్‌’ తాజాగా మరో కొత్త టూల్‌ను విడుదల చేసింది. సొంతంగా సీ-కంపైలర్లను రూపొందించే మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘ఆంథ్రోపిక్‌ (Anthropic AI)’పై గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) స్పందించారు. దీనిపై అనవసర భయాలు అక్కర్లేదని పేర్కొన్నారు.

‘‘గూగుల్‌ సెర్చ్‌, యూట్యూబ్‌ మాదిరిగానే ఏఐ కూడా ఓ సాధారణమైన సపోర్టింగ్‌ టూల్‌. దీనిపై మార్కెట్లలో అనవసర భయాలు నెలకొన్నాయి. ఇలాంటివాటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాంకేతికతను తమ ప్రయోజనాలకు తగ్గటుగానే వినియోగించే కంపెనీలకు ఇదో చక్కటి అవకాశం’’ అని సుందర్‌ పిచాయ్‌ వివరించారు.

అటు ఎన్విడియా సీఈఓ జెన్సెన్‌ హువాంగ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతమున్న సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను ఏఐ మరింత సమర్థంగా మారుస్తుందని పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande