అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఆదేశం
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు (MLA Defection Case) విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) మూడు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయస్థానంలో ఈరోజు జరిగిన విచారణలో కీలక పరిణామాల
అసెంబ్లీ స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఆదేశం


హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు (MLA Defection Case) విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) మూడు వారాల పాటు వాయిదా వేసింది. న్యాయస్థానంలో ఈరోజు జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం.. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వద్ద విచారణ ప్రస్తుతం కొనసాగుతోందని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో మూడు వారాల సమయం కావాలని ఆయన కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande