గంప గుత్తగా ఓట్లకు గాలం.. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల వ్యూహం!
మేడ్చల్, 06 ఫిబ్రవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల వేట మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేడ్చల్ జిల్లాలోని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ లోగా ఎల్లంపేట, మూడు చింతలపల్లి, అలియాబాద్ ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు రకరకాల వ్యూహాలకు
Municipal


మేడ్చల్, 06 ఫిబ్రవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల వేట

మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేడ్చల్ జిల్లాలోని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ లోగా ఎల్లంపేట, మూడు చింతలపల్లి, అలియాబాద్ ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు రకరకాల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు తమదైన శైలిలో అనుయాయులను రంగంలోకి దింపారు. ఎలాగోలా ఓటర్లను బుట్టలో వేసుకునే పని మొదలు పెట్టారు. ఒకవైపు పార్టీ బూత్ కమిటీ సభ్యులను అప్రమత్తం చేస్తూనే మరోవైపు గంప గుత్త ఓట్ల వేటలో పడ్డారు. వాటిపైనే గురి పెట్టి గాలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుల, మత, ఉద్యోగ, కాలనీ, కార్మిక, బస్తీ ఇలా రకరకాల సంఘాలపై దృష్టి పెట్టారు.

బూత్ కమిటీలపై నజర్..

అలియాబాద్, లాలాగడి మలక్ పేట, మూడు చింతలపల్లి, మజీద్ పూర, తుర్కపల్లి లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలతో పల్లెల్లోనూ ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తాజాగా పోలింగ్ బూత్ లు, కమిటీలపై దృష్టి సారించారు. ఏయే పోలింగ్ బూత్ పరిధిలో ఎవరెవరు విధుల్లో ఉంటారు. వారి పని సామర్థ్యం ఏమిటి.. వారికి ఎలాంటి వనరులు సమకూర్చాలనే పలు అంశాలపై నిశిత పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఒక్కో వార్డులో పోలింగ్ బూత్ లు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఓట్ల లెక్కలు కడుతున్నారు. ప్రతి బూత్ పరిధిలో మెజారిటీ ఓట్లను సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో బూత్ లో 8 నుంచి 10 మంది తగ్గకుండా పార్టీల నాయకులు, కార్యకర్తలను కమిటీ సభ్యులుగా చేర్చారు. వీరు ప్రతి రోజు బూత్ ల పరిధిలో ఓటర్లను గుర్తించాలి. దగ్గర్లో లేని వారి గురించి ఆరా తీయాలి. ఇంటింటికి తిరిగి పార్టీలు కరపత్రాలు పంపిణీ చేస్తూ.. స్టిక్కర్లను అంటిస్తూ ప్రచారం చేయాలి. పోలింగ్ రోజు ఓటర్లను కేంద్రానికి తీసుకొచ్చే బాధ్యత వీరిదే. మూడు మున్సిపాలిటీల్లో 136 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 65,866 ఓటర్లు ఉన్నారు. వీరిలో అధిక శాతం ఓట్లు తమ పార్టీకే వేసేలా పార్టీలు నిమగ్నమయ్యాయి.

సంఘాలతో మమేకమై..

ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల నేతలు రాజకీయ ఎత్తుగడలు మారుస్తున్నారు. తాజాగా కుల సంఘాలు, రకరకాల యూనియన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే శామీర్ పేట లో ఉన్న హెచ్ బీఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో కార్మికుల జీతాల పెంపు ధర్నాలో గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు పాల్గొని సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపడం ఇందుకు నిదర్శనం. కులాల వారీగా ఉన్న సంఘాలు కొన్ని ప్రాంతాల్లో లక్ష్య సాధన కోసం చురుగ్గా పనిచేస్తున్నాయి. వాటి ప్రభావం ఆయా ప్రాంతాల్లో బలంగా పనిచేస్తుందని కొందరు అభ్యర్థులు విశ్వసిస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి ఆయా మున్సిపాలిటీల్లో నివాసం ఉంటూ, ఓటు హక్కు కలిగిన వారు వేలల్లోనే ఉన్నారు. వీరి ఓట్లను శాతం ఆయా పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అసోసియేషన్లు, మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు వెనకాడటం లేదు.

ఓటర్లకు ఫోన్ కాల్స్..

పురపాలక ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. దీంతో క్షేత్ర స్థాయి బూత్ కమిటీ పైనే అభ్యర్థులు ఎక్కువ భారం మోపుతున్నారు. ఇంటింటికీ వెళ్తున్న కమిటీ సభ్యుల రోజువారీ నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఏ రోజుకారోజు ఓటర్ల మనోగతం, ఆయా ప్రాంత స్థానిక పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అవసరమైతే కలిసిన ఓటర్ల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. వీలైతే అభ్యర్థితోనూ మాట్లాడిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande