సమయం పాటించని పీఓ, ఏపీఓలకు నోటీసులు ఇవ్వండి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, 06 ఫిబ్రవరి (హి.స.) మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన అంశాలపై ట్రైనింగ్ కి నిర్దేశించిన సమయానికి పీఓలు, ఏపీఓలు రావడంలో సమయపాలన పాటించని వారికి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ గౌడ్ ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక
Collector


నారాయణపేట, 06 ఫిబ్రవరి (హి.స.)

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన అంశాలపై ట్రైనింగ్ కి నిర్దేశించిన సమయానికి పీఓలు, ఏపీఓలు రావడంలో సమయపాలన పాటించని వారికి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ గౌడ్ ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో మక్తల్ బాలుర పాఠశాలలో పీఓ, ఏపీఓలకు మున్సిపల్ ఎన్నికలపై విధి నిర్వహణలో పాటించాల్సిన అంశాలపై కలెక్టర్ శిక్షణ ప్రారంభించాల్సి ఉండగా.. 11 గంటలుఅయినా సమయ పాలన పాటించకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేసారు. జిల్లా కేంద్రం నుంచి తాను ఇక్కడికి వచ్చి సమావేశం నిర్వహిస్తుంటే.. ట్రైనింగ్ హాల్ మాత్రం ఖాలీగా కనిపించడం విచిత్రం కల్పించిందని కలెక్టర్ తెలిపారు. పీఓలు, ఏపీఓలు సమయానికి రాకపోవడంతో మండల పరిధిలో ఉన్న 150 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం పెంచాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. దీంతో పాటు రాయచూర్ రోడ్డు లో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీరామ్ సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande