దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి (Stock Market). ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఉదయం నష్టాల నుంచి సూచీలు కొద్దిమేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి, 83,580 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 50 పాయింట
దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో


హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి (Stock Market). ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఉదయం నష్టాల నుంచి సూచీలు కొద్దిమేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి, 83,580 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి, 26,693 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 83,249 వద్ద ప్రారంభమై ఒక దశలో 83,612 వద్ద గరిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 36 పైసలు కోల్పోయి.. 90.70గా స్థిరపడింది.

నిఫ్టీ సూచీలో ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు రాణించగా.. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆంథ్రోపిక్ కొత్త ఐటీ టూల్స్‌పై ప్రకటన చేయడంతో ఐటీ షేర్లలో నష్టాలు మరోరోజు కొనసాగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande