
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)వైకాపా (YSRCP) అధినేత జగన్ పర్యటన సందర్భంగా అపశ్రుతి చోటు చేసుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించేందుకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయల్దేరారు. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి సమీపంలో వైకాపా నేత ఒకరు మృతి చెందారు. జగన్ పర్యటన దృష్ట్యా జోగి రమేష్ ఇంటికి వెళ్తున్న వైకాపా చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు డి.రాంబాబు పల్స్ పడిపోయి కుప్పకూలారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇబ్రహీంపట్నంలో బైక్‌పై స్టంట్ చేస్తూ రోడ్డుపై బార్ గేట్‌ను ఢీకొని యువకుడు మృతి చెందాడు. మృతుడు ఇబ్రహీంపట్నం కొత్తగేట్‌కు చెందిన భార్గవ్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు