రేవంత్ రెడ్డి రాహువైతే, కేసీఆర్ - కేటీఆర్ కేతువులు.
మున్సిపాలిటీ-మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
BJP manifesto


మంచిర్యాల, 07 ఫిబ్రవరి (హి.స.)

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను నిజంగా కాపాడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా పట్టణాల అభివృద్ధి అసాధ్యం.అని రామచందర్ రావు అన్నారు.

అమృత్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ వంటి కీలక పట్టణాభివృద్ధి పథకాలు అన్నీ కేంద్ర ప్రభుత్వమే రూపకల్పన చేసి అమలు చేస్తున్నవే. ఈ పథకాల ద్వారానే తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం, మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి.

పేదలకు ప్రతి నెల 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, డ్రైనేజీల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు పూర్తిగా కేంద్ర నిధులతోనే కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఈ రోజు కనిపిస్తున్న అభివృద్ధికి మూలాధారం కేంద్ర ప్రభుత్వమే.

భారతీయ జనతా పార్టీ మాత్రమే అవినీతి రహిత పాలనను అందించగల పార్టీ. ప్రజలపై అదనపు పన్నులు వేయకుండా, భారం మోపకుండా అభివృద్ధి చేస్తుంది.

బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య అవినాభావ బంధం స్పష్టంగా ఉంది. అది తుమ్మబంక బంధమా, యాపబంక బంధమా అన్నది ప్రజలే నిర్ణయించాలి. కానీ ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి రక్షణగా నిలుస్తున్నాయన్నది వాస్తవం.

గతంలో కేసీఆర్ - కేటీఆర్ లు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని రక్షించారు. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పాలనలో అవినీతి కేసుల్లో కేసీఆర్- కేటీఆర్ లను కాపాడే పని జరుగుతోంది. ఇది పరస్పర రాజకీయ రక్షణకు స్పష్టమైన నిదర్శనం.

ఇవాళ హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు అక్కడ ఉన్నాయని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది కొత్త విషయం కాదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియట్‌లో ఫైళ్లు కాలిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే తరహాలో సాక్షాలు మాయం అవుతున్నాయి.

అంటే బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా-అవినీతికి సంబంధించిన ఆధారాలను నాశనం చేయడంలో రెండూ ఒక్కటే. ఒకరు దొంగ అయితే, మరొకరు దోపిడీ దొంగ.

రేవంత్ రెడ్డి రాహువైతే, కేసీఆర్ - కేటీఆర్ కేతువులు. ఈ రాహు-కేతువుల పాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. ఈ అంధకారం నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం ఒక్కటే మార్గం. మంచిర్యాలలో మేయర్ సీటు బిజెపి గెలిచేలా ఓటువేయలని కోరుతున్నాను.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande