FSLలో అగ్నిప్రమాదం - యాదృచ్ఛికమా? లేక పక్కా స్కెచ్చా?
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.) ''ఓటుకు నోటు'' ఫైళ్లు బూడిదయ్యాయా... లేక కావాలనే కీలక కేసుల ఫైళ్లు బుగ్గి చేశారా? 1. పక్కా ప్లాన్ అనే అనుమానం: ఓటుకు నోటు కేసు వంటి అత్యంత కీలకమైన ఫైల్స్ ఉన్న సెక్షన్‌లోనే షార్ట్ సర్క్యూట్ జరగడం కేవలం యాదృచ్ఛికం
FSLలో అగ్నిప్రమాదం - యాదృచ్ఛికమా? లేక పక్కా స్కెచ్చా?


హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)

'ఓటుకు నోటు' ఫైళ్లు బూడిదయ్యాయా... లేక కావాలనే కీలక కేసుల ఫైళ్లు బుగ్గి చేశారా?

1. పక్కా ప్లాన్ అనే అనుమానం:

ఓటుకు నోటు కేసు వంటి అత్యంత కీలకమైన ఫైల్స్ ఉన్న సెక్షన్‌లోనే షార్ట్ సర్క్యూట్ జరగడం కేవలం యాదృచ్ఛికం అంటే ఎవరూ నమ్మరు. ఇది సాంకేతిక లోపం కాదు, సాక్ష్యాలను తుడిచిపెట్టే పక్కా ప్లాన్ అని స్పష్టంగా అర్థమవుతోంది. మంటలు అంటుకున్నది ఫైళ్లకు కాదు... ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య విలువలకి! దీని వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరో తేలాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే.

2. డిజిటల్ సాక్ష్యాల మాయం:

కంప్యూటర్లు కాలిపోయాయా లేక కుంభకోణాల సాక్ష్యాలను బూడిద చేశారా? అధునాతన సాంకేతికత ఉన్న ఈ రోజుల్లో, డేటా బ్యాకప్ లేకుండా సాక్ష్యాలు తగలబడిపోయాయి అని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. ఇది నేరస్థులను రక్షించే వ్యవస్థీకృత కుట్ర (Organized Conspiracy) అని ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది! ఈ ఫైళ్ల దహనం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ బయటకు రావాలి.

3. ప్రభుత్వ బాధ్యతపై నిలదీత:

రాష్ట్రంలో అత్యంత భద్రత ఉండాల్సిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? నలుగురు ఉద్యోగులు ప్రాణాలతో బయటపడటం సంతోషమే, కానీ వేల కేసుల భవితవ్యం, అసలు నిజాలు మాత్రం లోపలే సమాధి అయిపోయాయా? ఈ ప్రమాదంపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరపకపోతే... ఈ నేరంలో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది అని అనుకోవాల్సి వస్తుంది!

ప్రధాన డిమాండ్లు:

* న్యాయ విచారణ: వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయాలి.

* డేటా బహిర్గతం: క్లౌడ్ బ్యాకప్ నుండి డేటాను రికవర్ చేసి, ఏయే ఫైల్స్ సేఫ్ గా ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలి.

* అధికారుల సస్పెన్షన్: భద్రతా వైఫల్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande