టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!
హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌, యూఎస్‌ఏ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్‌ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ మ
టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!


హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌, యూఎస్‌ఏ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్‌ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఆరుగుర బ్యాటర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు మోనాంక్‌ తెలిపాడు. ఇది స్కోరింగ్ గ్రౌండ్ అని, అందుకే తాము టార్గెట్ ఛేదించడానికి చూస్తున్నాం అని చెప్పాడు. ప్రపంచకప్ తనకు కల అని, తమపై చాలా అంచనాలు ఉన్నాయని మోనాంక్‌ చెప్పుకొచ్చాడు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రాలు మ్యాచ్ ఆడడం లేదని చెప్పాడు. బుమ్రా స్థానంలో హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ ఆడుతున్నడని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడనున్నాడు. తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం అని సూర్య చెప్పాడు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande