పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.. జోగులాంబ కలెక్టర్
జోగులాంబ గద్వాల, 14 మార్చి (హి.స.) పదో తరగతి పరీక్షలను( Exams ) ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ( Collector Rizwan Basha ) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రా
Collector


జోగులాంబ గద్వాల, 14 మార్చి (హి.స.)

పదో తరగతి పరీక్షలను( Exams ) ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ( Collector Rizwan Basha ) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థులు ఇన్విజిలేటర్లు, ఇతర ఎవరూ కూడా పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్స్ తీసుకురాకుండా కట్టుదిట్టంగా తనిఖీలు చేయాలన్నారు.

వేసవి కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఫ్యాన్లు వెలుతురు ఉండేలా చూడాలని అన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారిని విజయలక్ష్మి, జిల్లా పరీక్షల సమన్వయకర్త శ్రీనివాసులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande