మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి.. మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, 14 మార్చి (హి.స.) మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలను వర్తింపజేస్త
మంత్రి కోమటిరెడ్డి


నల్గొండ, 14 మార్చి (హి.స.)

మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలను వర్తింపజేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫెకెట్ల ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

యువత ప్రతి ఒక్కరూ పని చేస్తూ ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సెట్విన్ శిక్షణ కేంద్రంలో యువతకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉపాధి మార్గాలను చూపించాలని, అప్పుడే సెట్విన్ ల లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటిఐ లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కేంద్రాలు, న్యాక్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సెట్విన్ లో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న వెంటనే ఏర్పాటు చేస్తానని, యువతీ యువకులు ఇలాంటి శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని మంత్రి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande