పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన నిర్మల్ కలెక్టర్
నిర్మ, 14 మార్చి (హి.స.) పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని సోమవార్పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్
కలెక్టర్


నిర్మ, 14 మార్చి (హి.స.)

పదో తరగతి పరీక్షలను ప్రశాంత

వాతావరణంలో పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని సోమవార్పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న గదులను, పరీక్షల నిర్వహణ సరళిని పరిశీలించారు. విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన బెంచీలు, లైటింగ్, త్రాగునీరు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించారా లేదా అన్న విషయాన్ని పరిశీలించారు.

ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, పరీక్షా కేంద్రంలో కేటాయించిన విద్యార్థుల సంఖ్య, హాజరైన విద్యార్థుల సంఖ్య, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాసేలా పటిష్ట ఏర్పాట్లు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని పటిష్ట ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని, అన్ని పరీక్షలను పకడ్బందీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరీక్షా కేంద్రం తనిఖీలో డీఈఓ భోజన్న, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande