బ్రాహ్మణులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, 14 మార్చి (హి.స.) కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ముందే బ్రాహ్మణులు, వేద మంత్రాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి. ఈ నెల 12వ తేదీన మానకొండూర్ ఎమ్మెల్యే డా
బండి సంజయ్


హైదరాబాద్, 14 మార్చి (హి.స.)

కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ముందే బ్రాహ్మణులు, వేద మంత్రాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి. ఈ నెల 12వ తేదీన మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం గాంధీ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణకు బ్రాహ్మణ పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన మందుల సామేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఆదివాసులకు, దళితులకు భారత దేశంలో ప్రమాదం పొంచి ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతోంది. మనువాద వ్యవస్థ మన ఇంటి మీదకు వచ్చింది. ఇందాక ఇక్కడ బాపనాయన ముచ్చట చదివిండు. వాడు ల* కొడుక అన్నాడో తెలియదు. *మిడి కొడుకా అన్నాడో తెలియదు. ఈ వ్యవస్థ ఇలా ఉంది' అంటూ వ్యాఖ్యలు చేశారు.

మందుల సామేల్ వ్యాఖ్యలపై శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మందుల సామేల్ మూర్ఖుడని ఆయన ఫాల్తు మాటలు బంద్ చేయాలన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి బాటలోనే కాంగ్రెస్ నాయకులు నడుస్తున్నట్లున్నారు. బ్రాహ్మణులను పిలిపించారు. వారు వచ్చి ఆశీర్వాదం ఇస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతారా? అని మండిపడ్డారు. సర్వేజన సుఖినోభవంతు అనేది హిందూ ధర్మం గొప్పతనం అన్నారు. మందుల సామేల్ అనే మూర్ఖుడికి ఏమి తెలియదు. కానీ ఆ వేదికపై ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నాయకులకు సిగ్గుండాలన్నారు.

ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి:

మందుల సామేల్ హిందూ ధర్మాన్ని హేళన చేస్తుంటే స్టేజీపై ఉన్న కాంగ్రెస్ నేతలు చప్పట్లు కొడుతూ రాక్షసానందం పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను హిందూ సమాజం గుర్తించాలని బండి సంజయ్ అన్నారు. తుంగతుర్తిలో ఈసారి మందుల సామేల్ ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. మందుల సామేల్ ఎస్సీనా? బీసీనా చెప్పాలన్నారు. నిజమైన క్రిస్టియన్స్ ఇలాంటి భాష మాట్లాడరని, మందుల సామేల్ క్షమాపణలు హిందూ సమాజానికి అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన మందుల సామేల్ పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande