
దేవరపల్లి, 22 మార్చి (హి.స.)తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్లైఓవర్పై ఒక కారు రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కార్లు నుజ్జునుజ్జయ్యాయి.
మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV