
నారాయణపేట, 22 మార్చి (హి.స.)
మత్స్య పాడి పరిశ్రమ క్రీడా శాఖ మంత్రి శ్రీహరిని నారాయణపేట జిల్లా ఎస్పీ వినీత్ ఆదివారం ఉదయం మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలకుండిని అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతలపై తీసుకోవాల్సిన చర్యలపై సున్నితమైన ప్రదేశాల్లో ఏ వర్గం వారి మనసు మనోభావాలు దెబ్బ తినకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో ఎస్పీ చర్చించినట్లు సమాచారం. నారాయణపేట జిల్లా అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్నందున రవాణా నేరాలపై నియంత్రణ అక్రమ రవాణాలపై క్రైమ్ విషయంలో రెండు రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు జిల్లా ఎస్పీ వినీత్ 'తెలియజేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కీలకంగా జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఎస్పి తెలిపారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..