తిరుమలకు భక్తుల తాకిడి.. బాటగంగమ్మ గుడి వరకూ క్యూలైన్
తిరుమల, 22 మార్చి (హి.స.) తిరుమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి.. బాటగంగమ్మ గుడి వరకూ క్యూలైన్లో సర్వదర్శనానికి వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల వరకూ క్యూలైన్లో ఉండి, టోకెన్ లేని భక్తులకు
తిరుమల


తిరుమల, 22 మార్చి (హి.స.)

తిరుమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి.. బాటగంగమ్మ గుడి వరకూ క్యూలైన్లో సర్వదర్శనానికి వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల వరకూ క్యూలైన్లో ఉండి, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. 8 గంటల తర్వాత క్యూలైన్లోకి వెళ్లిన భక్తులకు 24 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. భక్తుల రద్దీని బట్టి టోకెన్ లేని భక్తుల దర్శనం వెయిటింగ్ సమయం మారుతుందని పేర్కొంది. కాగా.. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4-7 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. కాగా.. నిన్న (శనివారం) స్వామివారిని 77,864 మంది భక్తులు దర్శించుకోగా.. 39,348 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande