తిరుపతి స్టేట్ ఇన్స్టిట్యూ ఆఫ్ హోటల్.మేనేజ్మెంట్. సిబ్బందు వేతన జాతరకు తెర
అమరావతి, 26 మార్చి (హి.స.) , తిరుపతి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం) సిబ్బంది వేతన కష్టాలకు తెరపడింది. పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో రూ.84 లక్షల బకాయి వేతనాలు విడుదలయ్యాయి. గత ప్రభుత్వ వైఖరి కారణంగా గత 22 నెలలుగా జీ
తిరుపతి స్టేట్ ఇన్స్టిట్యూ ఆఫ్ హోటల్.మేనేజ్మెంట్. సిబ్బందు వేతన జాతరకు తెర


అమరావతి, 26 మార్చి (హి.స.)

, తిరుపతి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం) సిబ్బంది వేతన కష్టాలకు తెరపడింది. పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో రూ.84 లక్షల బకాయి వేతనాలు విడుదలయ్యాయి. గత ప్రభుత్వ వైఖరి కారణంగా గత 22 నెలలుగా జీతాలు నిలిచిపోయి సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రి కందుల దుర్గేశ్తో పాటు కూటమి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

సచివాలయంలో మంత్రి దుర్గేశ్ను టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి, త్వరితగతిన నిధులు విడుదల చేయడానికి కృషి చేసినందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande