
అమరావతి, 31 మార్చి (హి.స.)నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్కు చెందిన మూడు వేర్వేరు శాఖల్లో కేటుగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. ఫేక్ పేస్లిప్లు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ అడ్రస్ ప్రూఫ్లతో బ్యాంక్ ఖాతాలను సృష్టించారు. తద్వారా సుమారు రూ.5 కోట్ల నిధులు కొల్లగొట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంక్ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్కు చెందిన ఏలూరు రోడ్, గుణదల, బెంజ్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆయా శాఖల్లో నకిలీ ఖాతాలు తెరిచారు కేటుగాళ్లు. ఆ అకౌంట్లకు అనుబంధంగా క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5,28,19,939 నగదు లూటీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మోసాలకు పాల్పడిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ