
ములుగు, 31 మార్చి (హి.స.)
ప్రతి మహిళ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మహాలక్ష్మి పథకం మహిళలకు గొప్ప వరం లాంటిదని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళల జీవితాలలో వెలకట్టలేని మార్పును తీసుకువచ్చిందని తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం - ఉత్సవాలు 2026 కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలు ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 29 నాటికి 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి సుమారు 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆధా చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, జిల్లాలో ఇప్పటి వరకు 1 కోటి 90 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి 133.25 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని స్పష్టం చేశారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు