
న్యూఢిల్లీ, 10 ఏప్రిల్ (హి.స.)
కుంభమేళాలో ఒక్క ఫోటోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్గా మారిన గిరిజన యువతి మోనాలిసా ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రేమ వివాహం చట్టపరమైన సమస్యల్లో పడడంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సహజమైన అందంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా, అనంతరం ఫర్మన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమవడంతో విచారణ ప్రారంభమైంది.జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం బయటపడింది. మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించినట్లు తేలింది. అంటే 2026 మార్చిలో వివాహం జరిగే సమయానికి ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi