
ముంబై, 12 ఏప్రిల్ (హి.స.)
భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత స్వర శకం ముగిసింది. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూసింది. శనివారం సాయంత్రం తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె, పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆశా మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెకి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi