మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన సునీత లక్ష్మారెడ్డి
సింగూర్ నీటి విడుదలపై ఆందోళన వ్యక్తం చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
sunit


హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.)

సింగూర్ నీటి విడుదలపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నీటి విడుదలపై అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంజీరా డ్యామ్ అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు

ఘన్పూర్ ఆనకట్ట పరిధిలో వరి పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. నీరు అందకపోతే సుమారు 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేపట్టారు. పెట్టుబడులు పెట్టిన రైతులను అప్పుల పాలు చేయొద్దు: సునీత లక్ష్మారెడ్డి. పంటల చివరి తడి కోసం వెంటనే లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలని వినతి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande