
అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.) ఏపీ రాజధాని అమరావతి పేరుపై స్పష్టత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఇక నుంచి అన్ని అధికారిక నోట్లు AMARAVATI పేరుతోనే ఉండాలని స్పష్టం చేశారు. కొందరు AMARAVATI బదులు AMARAVATHI అని రాయడాన్ని తప్పుబట్టారు. అమరావతిని ఇంగ్లీష్లో రాసేటప్పుడు చివరిలో Thi కి బదులుగా Ti ఉండాలని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ