చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
తుడా అవినీతి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి జైలుకెళ్తారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు.
Chevireddy


తిరుపతి, 17 ఏప్రిల్ (హి.స.)తుడా అవినీతి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి జైలుకెళ్తారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. చెవిరెడ్డి కుటుంబానికి సహకరించిన అధికారులంతా వారం రోజుల్లో సస్పెండ్ అవుతారని తెలిపారు. దొంగ ఓట్లను చేర్పించిన వ్యవహారంలో చెవిరెడ్డికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈరోజు(శుక్రవారం) తిరుపతిలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ విలువల్లేని వ్యక్తి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అని విమర్శలు చేశారు. తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారని ఆరోపించారు.

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలోనే బయటపెడతానని పులివర్తి నాని హెచ్చరించారు. మంత్రి నారా లోకేశ్ను విమర్శించే అర్హత మోహిత్ రెడ్డికి లేదని ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు కేరాఫ్ చెవిరెడ్డి కుటుంబమని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని, చివరకు జగన్ను కూడా చెవిరెడ్డి వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు తెలియకుండా లిక్కర్ స్కాంలో రూ.600 కోట్లు చెవిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని.. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను 23నెలలుగా అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని చెప్పుకొచ్చారు. కక్షపూరిత రాజకీయాలు చేయకూడదని తాను సైలెంట్గా ఉన్నానని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande