కేటీఆర్ పాదయాత్ర ఇప్పుడెందుకు.. కవిత ప్రశ్నల వర్షం
పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎందుకు అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు.
Kavitha


హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇప్పుడు ఎందుకు అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు. తెలంగాణలో అన్నివర్గాలకు అధికారం రావాలన్నదే తన ధ్యేయమని వ్యాఖ్యానించారు. అందరికీ అధికారమని మాట్లాడుతారని.. దీనిని ఆచరణలోకి తీసుకురావాలని తాను ప్రారంభించాకే తనకు కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి పెట్టబోయే పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) జాగృతి కార్యాలయంలో కవితను పలువురు కలిశారు. ఆమెను కలిసిన వారిలో సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న ఉన్నారు.

ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ.. సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ తన గోల్ అని.. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. మారోజు వీరన్న అనుచరుల మద్దతు ఎంతో శక్తిని ఇస్తుందని అన్నారు. తమతో మారోజు వీరన్న అనుచరులు కలవటమంటే ఇక మనల్ని ఆపే శక్తే లేదని కవిత పేర్కొన్నారు. ఏదైనా శని ఉంటే పోవడం కోసమే తాను వారణాసి వెళ్లి పూజలు చేశానని ప్రస్తావించారు. తాను పెట్టే పార్టీ సక్సెస్ కావాలని కోరుకున్నానని తెలిపారు. బీఆర్ఎస్కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనను కలిశారని.. పేర్లు మాత్రం తాను చెప్పనని అన్నారు.బీఆర్ఎస్ పార్టీని ముందుగా టార్గెట్ చేశానని.. ఎందుకంటే తనను సస్పెండ్ చేశారనే మాట్లాడానని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande