
విశాఖపట్నం, 20 ఏప్రిల్ (హి.స.)
,:విశాఖపట్నంలోని గాజువాకలో ఈరోజు (సోమవారం) అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.l
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనరేటర్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆ షోరూమ్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు
మంటలు దట్టమైన పొగతో వ్యాపించడంతో, సమాచారం అందుకున్న వెంటనే గాజువాక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మొత్తం మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగకపోవడంతో షోరూమ్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ