
వరంగల్, 20 ఏప్రిల్ (హి.స.)
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా బసవ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా బసవ జీవితం, సూత్రాలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు.
సమానత్వం, సామాజిక న్యాయం, నైతిక విలువలను ప్రోత్సహించిన ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా బసవ గారి ఆదర్శాలను ఆచరణలో పెట్టి సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత ఆయన సందేశాలను గ్రహించి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు