
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్.. శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు.
ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్.. పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తున్నాను అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi