గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
హైదరాబాద్, 28 ఏప్రిల్ ( హిం సం)కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఇలా అన్ని ప్రాంతాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరించింది. బీజేపీ ధాటికి కాంగ్రెస్, ఆప్‌లు పత్తాలేకుండాపోయాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఒక విజయం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మా
Celebrating BJP's grand victory, Chief Minister and State President reach Kamalam


హైదరాబాద్, 28 ఏప్రిల్ ( హిం సం)కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఇలా అన్ని ప్రాంతాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను కనబరించింది. బీజేపీ ధాటికి కాంగ్రెస్, ఆప్‌లు పత్తాలేకుండాపోయాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఒక విజయం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గుజరాత్ గోధ్రాలో తొలిసారిగా, ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒక హిందూ మహిళ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.

గోధ్రా అల్లర్లు భారత చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటన. గుజరాత్‌లో మత కల్లోలానికి దారి తీసింది. తరుచు గోధ్రా మత ఘర్షణలకు వేదికగా నిలిచింది. 2002 వరకు ఈ మత ఘర్షణలు కొనసాగాయి. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారింది. గోధ్రాలోని 7వ వార్డు పూర్తిగా ముస్లిం మెజారిటీ ప్రాంతం, ఒక్క హిందూ ఓటర్ కూడా లేరు. అయినప్పటికీ, ఈ ప్రాంతం నుంచి సోనీ సామాజికి వర్గానికి చెందిన హిందూ మహిళ అపేక్ష సోనీ సంచలన విజయం సాధించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande