ఎగువ అహోబిలంలో ఘనంగా నృసింహ జయంతి.మహోత్సవాలు
ఎగువ అహోబిలంలో ఘనంగా నృసింహ జయంతి.మహోత్సవాలు
ఎగువ అహోబిలంలో ఘనంగా నృసింహ జయంతి.మహోత్సవాలు


ఆళ్లగడ్డ, 29 ఏప్రిల్ (హి.స.)

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారికి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను విశేషంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అర్చకులు రథం వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు చేసి శుభ ముహూర్తంలో రథాన్ని ముందుకు కదిలించారు. ఆలయ తిరువీధిలో స్వామి వారు రథంపై విహరించగా.. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దిగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామిని పంచామృతాలతో అభిషేకించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అహోబిలం మఠం జీపీఏ పార్థసారథి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande