
మైదుకూరు, 29 ఏప్రిల్ (హి.స.)
: కడప జిల్లా చాపాడు మండలం ఓబులరెడ్డిపేటలో దారుణ చోటుచేసుకుంది. కన్నతండ్రినే ఓ పదహారేళ్ల కుమారుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు. వివరాల్లోకి వెలితే.. ఓబులరెడ్డిపేట గ్రామానికి చెందిన గూడూరు పీరాన్ బాషా.. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన పీరాన్ బాషా రోజూ భార్యను వేధింపులకు గురిచేసేవాడు. మంగళవారం రాత్రి ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తన తల్లిని వేధించడం చూసి తట్టుకోలేని వారి పెద్ద కుమారుడు (16).. కత్తితో తండ్రిపై దాడి చేశాడు. తలతోపాటు దేహంపై పలు చోట్ల తీవ్రంగా గాయపడిన పీరాన్ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ