ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు
ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన గుర్తింపు


అమరావతి, 07 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. ఏపీ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం సంతకం చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 'మన రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని సీఎం చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande