శ్రీశైలం దేవస్థానంలో కొందరు ఉద్యోగులు దారి తప్పుతున్నారు
దారితప్పున శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులు...అక్రమార్జన
శ్రీశైలం దేవస్థానంలో కొందరు ఉద్యోగులు దారి తప్పుతున్నారు


శ్రీశైలం, 07 ఏప్రిల్ (హి.స.)

శ్రీశైల దేవస్థానంలో కొందరు ఉద్యోగులు ‘దారి’ తప్పుతున్నారు. భక్తుల సేవలు మరిచి.. అక్రమార్జనకు తెర తీశారు. ఇటీవల ఓ అధికారి ఆలయ సామగ్రిని నంద్యాలకు తరలించి బేరం పెట్టారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.. సాధారణ రోజుల్లో 35 వేల వరకు ఉండగా.. సెలవు రోజుల్లో 50 వేలు దాటుతోంది. ఉగాది, శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో హుండీ ఆదాయం రూ.5 కోట్ల వరకు ఉంటోంది. ఆదాయంలో సింహ భాగం అభివృద్ధి పనుల పేరుతో ఇంజినీరింగ్ విభాగానికే కేటాయిస్తున్నారు. సామగ్రి కొనుగోళ్లకు భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ఉద్యోగులు అవకాశం దొరికితే అక్రమార్జనకు పాల్పడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande