పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి కృషి
పిఠాపురం అభివృద్ధికి ప్రణాళికలు
పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి కృషి


పిఠాపురం, 07 ఏప్రిల్ (హి.స.)

ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే ఎన్నో నిధులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. అందులో భాగంగానే జనవరిలో దిల్లీ పర్యటన సందర్భంగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశమై పిఠాపురం రైల్వేస్టేషన్ను అమృత్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. ఆయన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు నిధులు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమృత్ భారత్ పథకంలో చేర్చుతూ రూ.37.25 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దాంతో స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్పోర్టు తరహాలో సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఇప్పటికే ఈ పథకం కింద జిల్లాలో కాకినాడ, తుని, సామర్లకోట స్టేషన్లలో పనులు జరుగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande