ఈ ఏడాది జనవరి నుంచి మార్చి లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల పై 273 కేసులు నమోదు
ఈ సంవత్సరం ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై 273 కేసులు నమోదయ్యాయి
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల పై 273 కేసులు నమోదు


అమలాపురం, 07 ఏప్రిల్ (హి.స.)

గతేడాది అక్టోబరులో కర్నూలు వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే గత నెలలో మార్కాపురం వద్ద మరో బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రవాణాశాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తున్నారు జిల్లా నుంచి రోజూ 20 వరకు ట్రావెల్స్ బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఇవన్నీ యానాం నుంచి అమలాపురం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. కాకినాడ- బెంగళూరు సర్వీసులు అయిదు జిల్లా నుంచే ప్రయాణిస్తున్నాయి. విద్యా సంస్థలకు చెందిన బస్సులు 650 వరకు ఉన్నాయి.

జిల్లా నుంచి వెళ్లే బస్సులను అన్నంపల్లి, ఈతకోట టోల్గేట్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. చాలా వాహనాల్లో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. అధిక లోడు, వైబర్లు పనిచేయకపోవడం, హెవీ లైటింగ్, డ్రైవర్ యూనిఫాం వేసుకోకపోవడంతోపాటు ఇతర లోపాలు తనిఖీల్లో బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు జరిగిన తనిఖీల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై 273 కేసులు నమోదు చేసి రూ.15,39,700 అపరాధ రుసుం విధించారు.

రవాణాశాఖతోపాటు కమర్షియల్ ట్యాక్స్, నార్కోటిక్స్, అగ్నిమాపక, పోలీసు, అబ్కారీశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపడితే పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రవాణా మినహా ఇతర శాఖలు హడావుడి చేసి తర్వాత వాటి గురించి మరిచిపోతున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande