కేరళం సీఎం విజయన్ మరో మోదీలా వ్యవహరిస్తుండు: సీఎం రేవంత్ రెడ్డి
కేరళ సీఎం విజయన్ పై విరుచుకపడిన సీఎం రేవంత్ రెడ్డి
Cm


తిరువనంతపురం, 07 ఏప్రిల్ (హి.స.)

కేరళ సీఎం పినరయి విజయన్

రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్ ఎప్పుడు సిద్ధమన్నా తాను చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఇవాళ ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్కి రోల్ మోడల్స్ జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీలా? లేక నరేంద్ర మోదీ, అమిత్ షానా? అని ప్రశ్నించారు. కానీ, ఆయన నరేంద్ర మోదీని తన రోల్ మోడల్గా భావిస్తున్నారని, ఆయన పద్ధతులు కేరళ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. విజయన్ ఓ ముఖ్యమంత్రిలా కాకుండా, మరో నరేంద్ర మోదీ' తరహాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పినరయి విజయన్పై ఉన్న అవినీతి కేసుల నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయనను రక్షిస్తోందని విమర్శించారు. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయనపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దేశ రాజకీయాల్లో ఇండియా (INDIA) కూటమి భాగస్వాముల మధ్య ఇటువంటి వాగ్వాదం చోటుచేసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande