
ఢిల్లీ, 07 ఏప్రిల్ (హి.స.)పాకిస్థాన్కు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ హెచ్చరికలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే.. కోల్కతానూ లక్ష్యంగా చేసుకుంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఇటీవల కవ్వింపులకు పాల్పడ్డారు. ఈ వ్యాఖ్యల పైనే తాజాగా రాజ్నాథ్ ఘాటుగా స్పందించారు.
ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే 55 ఏళ్ల క్రితం పాక్ (Pakistan) రెండుగా విడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్రదేశంగా ఏర్పడింది. నాడు బంగ్లా విముక్తి పోరాటానికి భారత సైన్యం అండగా నిలిచింది. ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయవద్దని ఇస్లామాబాద్ను ఆయన హెచ్చరించారు. వారు బెంగాల్పై కన్నేస్తే.. ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి అని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్