
న్యూఢిల్లీ, 07 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమాసియా (West Asia)లో యుద్ధం కారణంగా ఎల్పీజీ (LPG) సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రోజువారీ కేటాయించే 5 కేజీల ఉచిత వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కోటాను(Free Trade LPG cylinders) రెట్టింపు చేసింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఓఎంసీల సహాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు. అయితే, ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వేళ 5 కేజీల బరువుండే 'ఛోటూ' (Chotu) సిలిండర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మేజర్ పట్టణాలు, టౌన్లలో నివసించే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ గ్యాస్ కనెక్షన్ల కోసం అడ్రస్ ప్రూఫ్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (Identity Proof) చూపిస్తే 5 కేజీల 'ఛోటూ' సిలిండర్ను సులభంగా పొందవచ్చు
రాష్ట్రాలకు అందించే అదనపు సిలిండర్ల సరఫరాను ఈ ఏడాది మార్చి 2 నుంచి 3 తేదీల్లో అందించిన సగటు సరఫరా ఆధారంగా లెక్కించనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు