
న్యూఢిల్లీ, 07 ఏప్రిల్ (హి.స.)
ప్రపంచ ఆరోగ్య దినోత్సవంసందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, నర్సులు, ఫ్రంటైన్ ఆరోగ్య కార్యకర్తలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారి నిస్వార్థ సేవలే భారతదేశ ఆరోగ్య వ్యవస్థకు పటిష్టమైన పునాది అని ఆయన కొనియాడారు. ఈ ఏడాది అందరం కలిసి ఆరోగ్యానికి విజ్ఞానంతో ముందుకు.. (Together for health: Stand with science) అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ దినోత్సవం సందర్భంగా, విజ్ఞానశాస్త్ర సహకారంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే తన నిబద్ధతను ప్రధాని సోషల్ మీడియా వేదికగా పునరుద్ఘాటించారు.
కేవలం వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా, వ్యాధులు రాకుండా అడ్డుకునే 'ప్రివెంటివ్ హెల్త్కేర్' (Preventive Healthcare) ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మోదీ పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా పేదలకు వైద్యం చేరువ చేయడం, యోగా మరియు ఫిట్ ఇండియా కార్యక్రమాల ద్వారా శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను ఆయన గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..