ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి. జీ.సాయి.ప్రసాద్ పదవీకాలం ఆరునెలలు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి. జీ.సాయి.ప్రసాద్ పదవీకాలం ఆరునెలలు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి. జీ.సాయి.ప్రసాద్ పదవీకాలం ఆరునెలలు పొడిగింపు


అమరావతి, 15 మే (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సీఎస్గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సాధారణ పరిపాలన శాఖ(డీఓపీటీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. AIS రూల్ 16(1)(DCRB) 1958 ప్రకారం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఓపీటీ అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ యాదవ్ లేఖలో స్పష్టం చేశారు.

ఈ నెలాఖరులోనే(మే నెల) సాయి ప్రసాద్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయన పదవీకాలం పొడిగింపుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో నవంబర్ 30, 2026 వరకు సాయి ప్రసాద్.. ఏపీ సీఎస్గా కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు కేంద్రం ఈ అధికారిక సమాచారాన్ని అందించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande