
రాయదుర్గం, 02 మే (హి.స.) కలెక్టర్ ఓ. ఆనంద్ ఈ రోజు శనివారం బెలుగుప్ప మండలం వెల్ల గ్రామంలో తాగునీటి ఓవర్హెడ్ ట్యాంకు ఎక్కారు. ట్యాంకు మె ట్లు చకచకా ఎక్కి 1.5 లక్షల లీటర్ల నీటి పరిమాణం గల ట్యాంకు లోపల పరిశుభ్రతను పరిశీలించారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అవాక్కయ్యా రు.
బెలుగుప్ప మండలంలోని హనిమిరెడ్డిపల్లి గ్రామం వద్దనున్న ఎంఐ ట్యాంకును జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పరిశీలించారు. ట్యాంకుకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా నింపుతారు, జలధార కింద నీటి సంరక్షణ పనులు, కాలువల మరమ్మత్తు పనులు, చెరువుకు నీరు నింపే పనులు వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలధార పనులు సజావుగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం ట్యాంకుల పరిశుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టరు వెల్ల గ్రామం చేరుకుని ట్యాంకును పరిశీలించారు. తర్వాత వెల్లలో లేఅవుట్లో ఇళ్ల నిర్మాణం పరిశీలించారు. అనంతరం హనిమిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. . ఈ సందర్భంగా తాగునీటి ట్యాంకులు పరిశు భ్రపరిచేందుకు, క్లోరినేషన్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు కలెక్టరు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV