రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ప్రొద్దుటూరు, 02 మే (హి.స.)ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జమ్మలమడుగు మైదుకూరు బైపాస్ రోడ్డులోని శ్రీదేవి కళ్యాణ మండపం వద్ద గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొనడంతో బైక్పై వెళ్తు
ysr-kadapa-new/proddutur/two-killed-in-road-accident-0205-0239-1-16


ప్రొద్దుటూరు, 02 మే (హి.స.)ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

జమ్మలమడుగు మైదుకూరు బైపాస్ రోడ్డులోని శ్రీదేవి కళ్యాణ మండపం వద్ద గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకోగానే ప్రొద్దుటూరురూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande