తాగునీటి కోసం నిరసన – మహిళలు, సానికులు ఖాళీ బిందెలతో నిరసన
రాయదుర్గం (అనంతపురం), 02 మే (హి.స.) : రాయదుర్గం పట్టణంలోని మలకల్ మూర్ రోడ్డు ప్రాంతవాసులు ఈ రోజు ఉదయం ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వేసవికాలం వారం రోజులైనా తాగునీరు సరఫరా చేయకపోవడంతో తాము ఎలా బతకాలని మున్సిపల్ ఇంజనీర్లు స
protest-for-drinking-water-ceases-with-assurance-of-authorities


రాయదుర్గం (అనంతపురం), 02 మే (హి.స.) : రాయదుర్గం పట్టణంలోని మలకల్ మూర్ రోడ్డు ప్రాంతవాసులు ఈ రోజు ఉదయం ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

వేసవికాలం వారం రోజులైనా తాగునీరు సరఫరా చేయకపోవడంతో తాము ఎలా బతకాలని మున్సిపల్ ఇంజనీర్లు సురేష్, నరసింహులను నిలదీశారు. కాలనీలో దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయని, తాగునీటి పథకం నుంచి నీరు సరిగా రావడం లేదు, రోజూ తాగునీటి కోసం ఎదురు చూడాల్సి వస్తోందని, అధికారులు స్పందించి ప్రజల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. బోరు, టాంకర్ ఏర్పాటు చేసినప్పటికీ దానికి తాళం వేయడం వల్ల ఉపయోగంలో లేదన్నారు. కుళాయిలలో నీరు రాదని, ట్యాంకర్ కూడా సరఫరా చేయకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. ట్యాంకర్ తో నీటిని సరఫరా చేస్తామని, బోరు బావికి తాళం వేయకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande