విశాఖలో హోమ్ గార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రం నేడు.ప్రారంభం
అమరావతి, 22 మే (హి.స.) విశాఖపట్నం, విశాఖలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రం ఈరోజు(శుక్రవారం) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యా
విశాఖలో హోమ్ గార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రం నేడు.ప్రారంభం


అమరావతి, 22 మే (హి.స.)

విశాఖపట్నం, విశాఖలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రం ఈరోజు(శుక్రవారం) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. సుమారు రూ.33 లక్షల వరకు బీమా కవరేజ్ను పొందవచ్చు. హోం మంత్రి అనిత ప్రోత్సాహంతో మొదటి విడతగా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమాను అందించనున్నారు. ఈ బీమా పథకం కింద భర్త, భార్య, ఇద్దరు పిల్లల వరకు కవరేజ్ ఉంటుంది.

ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత మాట్లాడుతూ.. పోలీసు వారికి వర్తించే ఆరోగ్య భద్రత.. హోంగార్డులకు వర్తించకపోవడం, వారి వేతనాలు తక్కువగా ఉండటం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఏడాది రూ.3 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. దీని ద్వారా సుమారు 3,140 మంది లబ్ధి పొందనున్నారని తెలిపారు. హోంగార్డుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. విధుల్లో మరణించిన హోంగార్డుల కుటుంబాలకు తిరిగి ఉద్యోగం కల్పించే పరిస్థితి లేనందున.. ఆ కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా ఈ ఆరోగ్య బీమా ఎంతో సహాయపడుతుందని హోం మంత్రి అనిత వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande