శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కస్టమ్స్ తనిఖీలు.. రూ.10 కోట్ల విలువైన గంజాయి సీజ్
శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కస్టమ్స్ తనిఖీలు.. రూ.10 కోట్ల విలువైన గంజాయి సీజ్
Ganja


హైదరాబాద్, 22 మే (హి.స.)

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ

అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అర్ధరాత్రి దాటిన తర్వాత కస్టమ్స్ అధికారులు నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ (Bangkok) నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ.10 కోట్ల విలువైన 10 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఫ్లైట్ ఫ్లైట్ ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం స్కానింగ్ చేస్తుండగా, ఓ ప్యాసింజర్ బ్యాగులపై అధికారులకు గట్టి అనుమానం వచ్చింది. దీంతో సదరు ప్రయాణికుడిని పక్కకు పిలిచి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, లోపల ప్రత్యేక ప్యాకెట్లలో దాచి ఉంచిన 10 కేజీల మేలురకం హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Weed) బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ మేరకు డ్రగ్స్ తరలిస్తున్న నిందితుడిని కస్టమ్స్ అధికారులు వెంటనే అరెస్ట్ చేసి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande