జే ఎస్ సీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్.విడుదల
అమరావతి, 22 మే (హి.స.) అమరావతి, : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 2026-27 సంవత్సరానికి జేఎస్సీ సమావేశాల షెడ్యూల్ను వివరించింది. అందుకు సంబం
జే ఎస్ సీ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్.విడుదల


అమరావతి, 22 మే (హి.స.)

అమరావతి, : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 2026-27 సంవత్సరానికి జేఎస్సీ సమావేశాల షెడ్యూల్ను వివరించింది. అందుకు సంబంధించిన జీవో ఆర్టీ నంబర్ 1032ను సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం రాజధాని అమరావతిలో విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో జిల్లా స్థాయి జేఎస్సీ సమావేశాలు ఉంటాయని తెలిపింది.

అలాగే జూన్, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో హెచ్వోడీ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా జులై, నవంబర్, మార్చిలో సచివాలయంలోని వివిధ శాఖల జేఎస్సీ సమావేశాలు ఉంటాయని పేర్కొంది. ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి వేదికగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande