రెండో వారంని వెహికల్ డే. సదర్భంగా.మాతృ నిమ్మల. రైలు ప్రయాణం
అమరావతి, 22 మే (హి.స), :రెండో వారం ‘నో వెహికల్ డే’ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ఈరోజు(శుక్రవారం) పాలకొల్లు నుంచి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడకు మంత్రి చేరుకున్నారు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి
రెండో వారంని వెహికల్ డే. సదర్భంగా.మాతృ నిమ్మల. రైలు ప్రయాణం


అమరావతి, 22 మే (హి.స), :రెండో వారం ‘నో వెహికల్ డే’ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు రైలులో ప్రయాణించారు. ఈరోజు(శుక్రవారం) పాలకొల్లు నుంచి ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడకు మంత్రి చేరుకున్నారు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్పై వెళ్లారు. వరుసగా రెండో వారం కూడా నో వెహికల్ డే సందర్భంగా సుమారు 18 కిలోమీటర్ల మేర మంత్రి నిమ్మల సైకిల్ తొక్కారు. తాడేపల్లి దగ్గర నిమ్మలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఒకే సైకిల్పై ఇద్దరూ కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

జగన్ ఒక పిచ్చి తుగ్లక్ అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేదని.. ప్రజలే భయపడుతున్నారని తెలిపారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలు జగన్కు అలవాటన్నారు. అమరావతిలో జరుగుతున్న పనులు చూసి వైసీపీ అధినేతకు భయం మొదలైందని.. అందుకే అమరావతిపై విషం కక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే పొట్టేలు తలల స్థానంలో ప్రజల తలలు నరుకుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు 11 సీట్లు కూడా రావని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande