
అహ్మదాబాద్, 31 మే (హి.స.)
ఐపీఎల్ ఫైనల్స్ నేటి సాయంత్రం
ప్రారంభం కానుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ షురూ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో బెంగళూరు, గుజరాత్ మధ్య జరిగే ఫైనల్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో నిన్న అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మైదానాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు.
అంతేకాదు రేపు ఉదయం 8 గంటల వరకు అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగానే ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేశారు. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే, ఇవాళ ఫైనల్స్ జరిగే సమయంలో వర్షం భారీగా పడితే.. రిజర్వ్ డే కూడా ఉంటుంది. ఛాన్స్ ఉంటే ఇవాళ సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. లేకపోతే రేపు యథావిధిగా మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ రేపు కూడా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉంటే, పాయింట్స్ టేబుల్ ప్రకారం బెంగుళూరును విజేతగా ప్రకటిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..