
హైదరాబాద్, 31 మే (హి.స.)భారత అథ్లెట్ గుర్విందర్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల గురించి ఆదివారం మన్‌కీ బాత్ 134వ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వందమీటర్ల పరుగులో రికార్డులు సృష్టించిన అథ్లెట్లు గుర్విందర్, అనిమేష్‌తో ఆయన నేరుగా మాట్లాడారు.
కేవలం రెండు రోజుల్లోనే 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయస్థాయిలో మూడు రికార్డులు సృష్టించామని మోదీ (PM Modi) అన్నారు. ఈ అద్భుతమైన ఘనత సాధించిన ఇద్దరు అథ్లెట్లు గుర్విందర్ సింగ్, అనిమేష్‌కు అభినందనలు తెలిపారు. మోదీ పర్యటన నేపథ్యంలో ‘అనైమంగళం’ రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారత్‌కు తిరిగి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇది భారతీయులు గర్వించదగిన విషయమని మోదీ అన్నారు.
ఇక, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కాలువల చిక్కుకుపోయిన డాల్ఫిన్‌ను కొందరు దాదాపు 13 గంటలపాటు శ్రమించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ప్రధాని మోదీ ఈ సంఘటనను కూడా మన్‌కీ బాత్‌లో మాట్లాడారు. గంటలపాటు శ్రమించి డాల్ఫిన్‌ను కాపాడినవారిని అభినందించారు. ఈ సహాయక చర్యల్లో కేంద్రం ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన డాల్ఫిన్ అంబుల్స్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు. కేరళలోని ఆలువా ప్రాంతంలో స్విమ్మింగ్ క్లబ్ సేవలను మోదీ ప్రశంసించారు. ఈ క్లబ్ ద్వారా ఇప్పటి వరకు 15వేల మందికి పైగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు