రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!
పుణె, 31 మే (హి.స.)ఓ కంపెనీ చెప్పాపెట్టకుండా క్లోజ్ అయింది. దీంతో 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. పుణెలోని హింజవాడి ఫేజ్-2లో ఉన్న థింక్ టెక్నాలజీ ఇండియా అనే ఐటీ సంస్థ ఎలాంటి ముందస్తు
రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!


పుణె, 31 మే (హి.స.)ఓ కంపెనీ చెప్పాపెట్టకుండా క్లోజ్ అయింది. దీంతో 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పుణెలోని హింజవాడి ఫేజ్-2లో ఉన్న థింక్ టెక్నాలజీ ఇండియా అనే ఐటీ సంస్థ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. రాత్రికి రాత్రే కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ ఘటనతో 700 మందికి పైగా ఉద్యోగులు, ఇంటర్న్స్, ఫ్రెషర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపెనీ వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడం, ఉద్యోగుల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం వంటివి కూడా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

ప్రారంభంలో భారీ నియామకాలు

థింక్ టెక్నాలజీ ఇండియా 2025లో పెద్ద మొత్తంలో నియామకాలను చేపట్టింది. ఇందులో ఫ్రెషర్స్, ఇంటర్న్స్, ఎక్స్పీరియన్స్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొదట్లో సంస్థ అందరికీ జీతాలు, స్టైఫండ్స్ క్రమంగా చెల్లించింది. దీంతో ఉద్యోగుల్లో సంస్థపై నమ్మకం పెరిగింది.

అయితే.. 2026 ప్రారంభం నుంచి పరిస్థితులు మారాయి. ఫిబ్రవరి నుంచి జీతాల చెల్లింపుల విషయంలో ఆలస్యం జరిగిందని ఉద్యోగులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి నెల 7 లేదా 8వ తేదీకి జమయ్యే జీతాలు ఆగిపోవడంతో ఉద్యోగులు యాజమాన్యాన్ని సంప్రదించారు. ఈ సమయంలో సంస్థ సీఈఓ హర్షల్ భానుదాస్ ఠాక్రే ఆడిట్ జరుగుతోందని, ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య పెండింగ్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande